దానిమ్మ Pomegranate juice for the prevention of anemia దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస...
![]() |
| దానిమ్మ |
Pomegranate juice for the prevention of anemia
దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస్య నివారణకు దానిమ్మ రసం వినియోగం బాగా అక్కరకొస్తుంది. ఇక దానిమ్మకు తోడు 4 పుదీనా ఆకులు చేర్చితే ఇతర పోషకాలతో పాటు రుచి, సువాసన చేకూరతాయి. ఇందులో కలిపే బెల్లం వల్ల కాల్షియం, ఐరన్ లభిస్తాయి. విష జ్వరాలు., ఇతర అనారోగ్యాలతో చికిత్స తీసుకొన్న రోగులు రోజూ గ్లాసు చొప్పున ఈ దానిమ్మ రసం తాగితే వారంలో ఫలితం కనిపిస్తుంది.
కావలసినవి:
- దానిమ్మ గింజలు - 1 కప్పు,
- బెల్లం పొడి - 2 చెంచాలు,
- తాజా పుదీనా ఆకులు - 10.
తయారీ విధానం:
దానిమ్మ గింజలు, బెల్లం పొడి, పుదీనాలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి తిప్పుకోవాలి. ఆ తర్వాత దానికి మరికొన్ని నీళ్లు కలిపి తిప్పి దించి వడకట్టుకొంటే దానిమ్మ, పుదీనా జ్యూస్ సిద్దమైనట్లే. కావాలనుకొంటే ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి



No comments